హ్యూస్టన్ లో తెలుగు భవనం...ఘనంగా భూమిపూజ

Telugu Bhavan Ceremony in Houston

టెక్సాస్‍ రాష్ట్రంలో హ్యూస్టన్‍లో నివసిస్తున్న తెలుగువాళ్ళు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హ్యూస్టన్‍లో భారీ స్థాయిలో 35ఎకరాల విస్తీర్ణంలో తెలుగు భవనాన్ని నిర్మించడానికి నడుం బిగించారు. ఈ భవనంలో తెలుగుజాతి చరిత్ర ప్రతిబింబించే విధంగా ప్రదర్శనతో పాటు ఒక కమ్యూనిటీ హాలు, క్రీడా మైదానం, వ్యవసాయ క్షేత్రం తదితర వాటిని నిర్మించడానికి నడుం కట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ స్థానిక ప్రవాసులు, దాతలు కలిసి భూమిపూజ చేశారు. క్రికెట్‍, టెన్నిస్‍ ఇతర ఆటల కోసం ప్రత్యేక స్థలం, అలాగే పిక్నిక్‍కోసం ప్రత్యేక స్థలాన్ని ఇందులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఇతర కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించేలా భవన నిర్మాణం జరగనున్నది. హ్యూస్టన్‍లో నివసిస్తున్న వారితో పాటు పరిసర ప్రాంత తెలుగు వారు కూడా ఈ భవన నిర్మాణానికి చేయూతనందిస్తున్నారు. తెలుగు వారు గర్వించే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు తానా మాజీ అధ్యక్షురాలు ముత్యాల పద్మశ్రీ తదితరులు  తెలిపారు.

 


                    Advertise with us !!!