భారత్‌కు అండగా నిలుస్తున్న భారతీయ అమెరికన్లు.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ల పంపిణీ

us-sends-five-tonnes-of-oxygen-concentrators-to-india-amid-covid-crisis

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించేందుకు భారతీయ అమెరికన్లు చేతనైనంత సాయం చేయడానికి రెడీ అయ్యారు. భారత్‌కు మెడికల్ ఆక్సిజన్, ఇతర అత్యవసరాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. అమెరికాకు చెందిన సేవ ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే స్వచ్ఛంద సంస్థ భారత్‌కు ఇప్పటికే 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరఫరా చేసింది. అంతేగాక భారత్‌కు అందివ్వడం కోసం 5 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కేవలం రెండు రోజుల్లోనే 1.5 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించింది కూడా. భారత్‌కు అవసరమైన అత్యవసర వైద్య పరికరాలు, సరఫరాలను వెంటనే పంపేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ పేర్కొంది. భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరడగంతో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను ఎదుర్కునేందుకు సేవ చేయూతనివ్వాలని భావించింది. అందుకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల, ఇతర వైద్యపరికరాలను భారత్‌కు పంపుతోందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!