భారత్ మమ్మల్ని వ్యాక్సిన్ అడగలేదు.. ఆక్సిజన్ మాత్రమే

US Will Be There for India During COVID Crisis

కరోనా సెకండ్‍ వేవ్‍తో పోరాడుతున్న ఇండియాకు అవసరమైన అన్ని మందులు, ఆక్సిజన్‍ తదితర ఇతర వైద్య పరికరాలను అందించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా దగ్గర కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‍ డోసులు అవసరానికి మించి ఉన్నాయని, వాటిని ఇండియాలాంటి దేశాలకు ఇవ్వాలని ఇండియన్‍ అమెరికన్లతో పాటు యూఎస్‍ ఛాంబర్స్ ఆఫ్‍ కామర్స్ కూడా బైడెన్‍ ప్రభుత్వానికి డిమాండ్‍ చేసింది. అయితే భారత్‍ అసలు తమను వాడటానికి సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్లు అడగనే లేదని జో బైడెన్‍ వెల్లడించారు. అయితే ఈ లిస్ట్ లో వ్యాక్సిన్లు లేకపోవడం చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మోదీ ప్రభుత్వం వ్యాక్సిన్లు అడగలేదని అమెరికా వైస్‍హౌజ్‍ ప్రెస్‍ సెక్రటరీ జెన్‍ సాకీ వెల్లడించారు. నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు మా దగ్గర ఆస్ట్రాజెకా వ్యాక్సిన్లు అసలు లేనే లేవు అని ఆమె స్పష్టం చేశారు. సాకీ ప్రెస్‍ బ్రీఫ్‍లో చాలా వరకు ఇండియాకు సంబంధించిన ప్రశ్నలకే సమాధానాలు చెప్పారు. రానున వారాల్లో ఫెడరల్‍ డ్రగ్‍ అడ్మినిస్ట్రేషన్‍ (ఎఫ్‍డీఏ) అనుమతి ఇస్తే కోటీ డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‍ రిలీజ్‍ కానున్నట్లు ఆమె తెలిపారు. మరో 5 కోట్ల డోసులు మే, జూన్‍ నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇండియాలో వ్యాక్సిన్ల కొరత ఉన్న కూడా వాటిని అడగకుండా కేవలం ఆక్సిజన్‍, దాని సంబంధిత సరఫరాలు, ఇతర అత్యవసర మందులు ఇవ్వాలని అమెరికాను అడిగినట్లు యూఎస్‍ అడ్మినిస్ట్రేషన్‍ అధికారి తెలిపారు.

 


                    Advertise with us !!!