ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి : చంద్రబాబు
Nela Ticket
Kizen
APEDB

ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి : చంద్రబాబు

21-04-2017

ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి : చంద్రబాబు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో తన నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతేడాదితో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 16.13 మేర పెరిగిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క శాతానికే పరిమితమైందన్నారు. ఇక ఎన్నికలే  అజెండాగా నేతలందరూ ప్రజల్లోకి వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఇకపై తాను సాయంత్రం 6 గంటల తర్వాత పార్టీకే సమయం కేటాయించనున్నట్లు తెలిపారు.  ప్రతి నెల జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి ఆధ్వర్యంలో జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎస్టీ, ఎస్సీలను ఆకట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాల్లోనూ పట్టు పెంచుకునేలా కసరత్తు ప్రారంభించాలని సూచించారు.