రాజకీయాలకు త్వరలో గుడ్ బై

రాజకీయాలకు త్వరలో గుడ్ బై

12-07-2018

రాజకీయాలకు త్వరలో గుడ్ బై

త్వరలో రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నట్లు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వెల్లడించారు. అనంతపురంలో టీడీపీ ఎంపీలు చేపట్టిన కరువు నేలపై వివక్ష దీక్ష కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌లో పుట్టి పెరిగి తాను ఇంతటి వాడినయ్యాయన్నారు. అప్పట్లో ఇలా సభలు పెట్టి ప్రజలతో మాట్లాడుకున్న దాఖలాలు లేవని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. తనకన్నా జూనియర్లయిన వారికి మంత్రి పదవులు ఇచ్చినా తాను బాధపడలేదని అన్నారు. చంద్రబాబును పొగడడం లేదని, అయన మంచితనాన్ని మెచ్చుకుంటున్నానని అన్నారు. ఉన్నదున్నట్లుగా మాట్లాడడం తనకున్న దుష్టలక్షణమని అన్నారు. 70 ఏళ్ల వయసులోనూ జిల్లాలో కరవును చూడాల్సి వస్తోందన్నారు. అయితే చంద్రబాబు పుణ్యమా అని అనంతపురంలో మే, జూన్‌లో కూడా చెరువులు, కుంటల్లో నీటిని చూస్తున్నామన్నారు. ఇదంతా పట్టిసీమ ద్వారా సాధ్యమైందన్నారు. పోలవరం పూర్తయితే అనంతపురం జిల్లా కోనసీమను మించిపోతుందన్నారు