ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మనమే నెం.1

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మనమే నెం.1

12-07-2018

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మనమే నెం.1

నియంత్రణ, ప్రక్రియ, పారదర్శక విధానాల్లో సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రాల్లో పారిశ్రామిక అనుకూల వాతావరణం పెంచేదిశలో తీసుకు వచ్చిన వినూత్నమైన విధానాలతో ఏపీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమ స్థానాన్ని సాధించామన్నారు. ఇదుకోసం టీంవర్క్‌గా పనిచేసిన మంత్రులను, అధికారులను ప్రతిఒక్కరిని అభినందిస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నా అన్నింటిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌గా వుండాలనే తాము పనిచేస్తున్నామన్నారు.