పోలవరం పూర్తికి డెడ్ లైన్ ఎప్పుడు?

పోలవరం పూర్తికి డెడ్ లైన్ ఎప్పుడు?

12-07-2018

పోలవరం పూర్తికి డెడ్ లైన్ ఎప్పుడు?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సూటిప్రశ్న
గడ్కరీ పర్యటనతో బాబు అవినీతి బట్టబయలు
ఎన్నికల్లో డబ్బు సంచులు మోసిన వారికే పోలవరం కాంట్రాక్టులు 

– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బొత్స సత్యనారాయణ 

బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్‌ పాయింట్స్‌:– 

ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉందా ? చిత్తశుద్ది ఉంటే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేసిన బొత్స సత్యనారాయణ. కమీషన్ల కోసం చంద్రబాబు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. 

కేంద్రమంత్రి గట్కరీ ప్రశ్నలతో చంద్రబాబు అవినీతి బట్టబయలైంది.

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక జీవనాడి. వ్యవసాయానికి, విద్యుత్‌ శక్తికి, కోట్ల మంది ప్రజల గొంతు తడిపేందుకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేశారు. ఆనాడు (వైయస్‌ఆర్‌ హయాంలో) పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా (బొత్స సత్యనారాయణ) ఆ శంకుస్థాపనలో పాల్గొనే మహాభాగ్యం కలిగింది. సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు పూర్తి చేశారని, నిర్మాణానికి కావాల్సిన అనుమతులు కూడా సాధించారు. మహానేత వైయస్‌ఆర్‌ తరువాత పాలించిన ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశాయి. 

రాష్ట్ర విభజన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించారు.  అయితే, పోలవరాన్ని అనే అంశాన్ని తెరమీదకు తీసుకురాకుండా స్వార్థంతో అవినీతికి ప్రాధాన్యం ఇస్తూ పట్టిసీమ నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు చర్యతో మేధావులు, రాజకీయ పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. సుమారు రూ. 16 వందల కోట్లు ఖర్చు చేసి ఎక్కడా లేని విధంగా నిబంధనలు పెట్టి.. ఎన్నికల్లో డబ్బు సంచులు మోసిన వారికి కాంట్రాక్టులు ఇప్పించి వందల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. ఇది వాస్తవం. రాజకీయ విమర్శలు కావు ఇవి. పట్టిసీమ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడింది వాస్తవం.

కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి అరకొర నిధులు కేటాయించిన ఏ ఒక్క రోజు చంద్రబాబు మాట్లాడలేదు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా అవినీతి కోసం పట్టిసీమ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలు చేశారు. 

గడ్కరీ ప్రశ్నలతో బాబుకు మచ్చెమటలు.. 
పోలవరం నిర్మాణం చిత్తశుద్ధి ఏది?

చంద్రబాబు వైఖరి చూస్తుంటే పోలవరం మీద చిత్తశుద్ధి ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయ్‌. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించాల్సిన నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారు. 

గడ్కరీ వైఖరిపైన ప్రశ్నలు వేసిన బొత్స. బీజేపీకి పోలవరం పూర్తి చేసే ఉద్దేశం ఉందా అనే సందేహం ప్రజలకు, ప్రతిపక్షానికి వస్తున్నాయ్‌. రెండోసారి పోలవరం సందర్శించిన గట్కరీ చంద్రబాబుకు సూటిప్రశ్నలు వేశారు. గడ్కరీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలేక మీడియా సమక్షంలో చంద్రబాబు నీళ్లు నమిలారు.  

మొదటి డీపీఆర్, రెండో డీపీఆర్‌కు ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయ్‌? ల్యాండ్‌ ఎక్స్‌టెన్షన్, సాంకేతిక అంశాలు తేడాలు ఎందుకు వచ్చాయ్, నిర్మాణాల అంచనా ఎందుకు ఎందుకు పెరిగిందని గడ్కరీ అడిగితే బాబు నేరస్తుడిలా బేల మోహం వేసుకుని సమాధానం చెప్పలేక బిత్తర చూపులు చూశారు. చంద్రబాబు నైజం, బలహీనత కేంద్రమంత్రి గడ్కరీకి తెలుసు కాబట్టే జంకుతున్నారు. బాబు మాటలు కానీ, ఆహార్యంలో తేడా స్పష్టంగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ చాలని చంద్రబాబే అన్నారు. ఉత్తరకుమారుడిలా మాట్లాడుతున్న నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమా..? ఇది జరిగి 24 గంటలు అవుతున్నా.. ఎందుకు సమాధానం చెప్పడం లేదు. 

గడ్కరీ బీజేపీ కార్యకర్తల సమావేశంలో అవినీతిని సహించేది లేదని చెప్పారని, అంటే పోలవరంలో అవినీతి జరిగిందని.. చంద్రబాబు వ్యవహార శైలి, నడవడిక, భాషను బట్టి స్పష్టంగా అర్థం అవుతోంది. లక్షలాది ఎకరాలకు, లక్షలాది మందికి తాగునీరు ఆదుకునే పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టి అవినీతి కోసం నిర్మాణాన్ని అడ్డుకోవడం భావ్యమా చంద్రబాబూ? 

టీడీపీ బీజేపీలకు చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్న బొత్స. డయాఫ్రం వాల్‌ కట్టి జాతికి అంకితం అంటారు. ఓ ఫౌండేషన్‌ వేసి జాతికి అంకితం అంటారు. ప్రతి సోమవారం పోలవరం అని ప్రజలను మోసగించారు. 29 సార్లు పోలవరానికి బాబు వెళ్లింది కేవలం కమీషన్ల లెక్కలు చూసుకోవటానికే. చీకటి ఒప్పందాలతో బయటకు వచ్చి టీడీపీ, బీజేపీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి పోలవరంపై మీ తాలూకా విధానం ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేసిన బొత్స. 

జాతీయ ప్రాజెక్టు అయిన దీన్ని ఎప్పటిలోపు పూర్తి చేయాలో కేంద్రం నిర్ణయించుకుంది? రాష్ట్రం రేపు అయిపోతోంది. 2018, 2019 అయిపోతోందని మాట్లాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టరు తాలూక పాత్ర పోషిస్తోంది కాబట్టి.. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలి. చిత్తశుద్ధితో ఎప్పటిలోపు పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాలి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్‌ చేస్తున్నాం. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. 

ఢిల్లీ రావాలని గడ్కరీ అడుగుతున్నారని అయితే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వంపైన ఉంది. జాతీయ ప్రాజెక్టును నిర్మించాల్సిన కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. ఇక్కడ ప్రాజెక్టు వల్ల వచ్చే లబ్ది, కాంట్రాక్టుల వల్ల వచ్చే  ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వం చూడటం వల్ల ఈ దుస్థితి కలిగింది. గడ్కరీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారు. 2014 భూసేకరణ వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. అయితే, భూసేకరణే కాకుండా మిగిలిన అంశాలూ డీపీఆర్‌లో ఎందుకు పెరిగాయని గడ్కరీ ప్రశ్నిస్తే మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు. స్వార్థంతోనే ప్రాజెక్టును ఆలస్యం చేస్తున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారు. రెండు పార్టీల (టీడీపీ, బీజేపీల) డొల్లతనం ఈ విషయంలో బట్టబయలు అయింది. 

ఈఓడీబీలో నెంబర్‌ వన్‌ వస్తే ప్రత్యేక హోదా ఇవ్వమని అనటం అసంబద్ధం. ఈఓడీబీకి, హోదాకు సంబంధమే లేదు. మహారాష్ట్ర, ఏపీకి వచ్చిన పెట్టుబడులు చూస్తే అసలు ఎలా ర్యాంక్‌ వచ్చిందో అర్థం కావటం లేదు. మనకన్నా ముందు మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయ్‌. దీన్ని ఏ రకంగా కొలమానంగా తీసుకున్నారో అర్థం కావటం లేదు. ఈ సందర్భంగా ఏఏ రాష్ట్రాలకు ఎంతెంత పెట్టుబడులు వచ్చాయో గణాంకాలను బొత్స వివరించారు. సమ్మిట్స్‌ సందర్భంగా తప్పుడు ఎంఓయులు చూపించి ఉంటే.. వాటి ఆధారంగా ఇచ్చారేమో అని బొత్స వ్యాఖ్యానించారు. 

లోకేశ్‌ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించటంపై వారి పార్టీ వాళ్లిష్టం అని కొట్టిపారేశారు.