తిత్లీ బాధితులతో దీపావళి జరుపుకోనున్న సీఎం చంద్రబాబు

తిత్లీ బాధితులతో దీపావళి జరుపుకోనున్న సీఎం చంద్రబాబు

06-11-2018

తిత్లీ బాధితులతో దీపావళి జరుపుకోనున్న సీఎం చంద్రబాబు

తిత్లీ తుపాను బాధితుల్లో మనోదైర్యం నింపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి పండగను వారి మధ్యే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దసరా పండుగను వారి మధ్యే చేస్తున్నకున్న ముఖ్యమంత్రి, దీపావళిని సైతం అక్కడే జరుపుకోవాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించే దీపావళి వేడుకల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఇందుకోసం సతీ సమేతంగా చంద్రబాబు శ్రీకాకుళానికి బయలుదేరనున్నారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలోనూ విశాఖలోనే ముఖ్యమంత్రి దీపావళిని జరుపుకున్నారు. ఆ సమయంలో నగరంలో టపాసులు కాల్చకుండా దీపాలు మాత్రమే వెలిగించి నగర ప్రజలు త్వరగా కోలుకోవాలనే స్ఫూర్తి నింపారు. ప్రజలు కంటే పండగలు ముఖ్యం కాదని అన్నారు.