ఏపీలో టీడీపీకి పొత్తు అవసరం లేదు

ఏపీలో టీడీపీకి పొత్తు అవసరం లేదు

06-11-2018

ఏపీలో టీడీపీకి పొత్తు అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ గెలుపు కోసం ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సృష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ఫ్యాక్షనిస్టుగా మారి ఏపీ ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను సైతం వెనక్కు తీసుకొని, ఏపీపై కక్షసాధింపు చర్యలను ప్రధాని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ గొంతు బలంగా ఉందేమో గానీ, వ్యక్తిగా మాత్రం ఆయన బలహీనంగా కనిపిస్తున్నారని విమర్శించారు. దేశం కోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా కర్ణాటక ఉప ఎన్నికల ఫతితాలే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి అనివార్యమైందని అన్నారు.