తెలంగాణలో ప్రచారానికి సీఎం చంద్రబాబు ఓకే

తెలంగాణలో ప్రచారానికి సీఎం చంద్రబాబు ఓకే

21-11-2018

తెలంగాణలో ప్రచారానికి సీఎం చంద్రబాబు ఓకే

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మహాకూటమి తరుపున ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 29, 30 తేదీలలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆ పార్టీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్న ఆయన ఇప్పుడు తాజాగా తెలంగాణలో మహాకూటమి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి, సీపీఐ తదితర పార్టీలతో కలిసి మహాకూటమిగా తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు మిగిలిన వారి గెలుపు కోసం విస్తృత్తమైన ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా వీలైనన్ని రోడ్‌ షోలను నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు, ఆ మేరకు టీడీపీ నేతలకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలలలో కొత్త ఉత్సాహం నెలకొంది. చంద్రబాబు ప్రచారంతో కొత్త ఊపు వస్తుందన్న భావనలో శ్రేణులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రాహుల్‌ గాంధీతో పాటు రెండు సభలలో పాల్గొనున్న చంద్రబాబు అనంతరం టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా ప్రాంతాలలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు.