పాదయాత్ర కాదు జగన్ ది విలాసయాత్ర : ముఖ్యమంత్రి చంద్రబాబు

పాదయాత్ర కాదు జగన్ ది విలాసయాత్ర : ముఖ్యమంత్రి చంద్రబాబు

12-01-2019

పాదయాత్ర కాదు జగన్ ది విలాసయాత్ర : ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్లాడు. 208రోజులు ఇంటికెళ్లకుండా నేను పాదయాత్ర చేశాను. పవిత్ర లక్ష్యంతో పాదయాత్ర చేశాను. పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారు.

ప్రత్యేక హోదా గురించి జగన్ మాట్లాడటం లేదు. కెసిఆర్ తో కలిసి ఏపికి హోదా సాధిస్తా అన్నాడు. అక్కడే జగన్ చిత్తశుద్ది ప్రజలకు అర్ధం అయ్యింది. టిఆర్ ఎస్ తో వైసిపి లాలూచికి జగన్ వ్యాఖ్యలే రుజువు. ఏపికి హోదాను వ్యతిరేకించే టిఆర్ ఎస్ తో జగన్ ములాఖత్. వాన్ పిక్, లేపాక్షి భూములను జగన్ వివాదాస్పదం చేశారు. విశాఖ ఏజెన్సీ బాక్సైట్ భూములు వివాదాల్లోకి నెట్టారు. ఓబులాపురం భూములను వివాదం చేశారు. వేలాది ఎకరాల భూములను కోర్టు కేసుల్లోకి నెట్టారు. ప్రజోపయోగం కాకుండా జగన్ చేశారు. అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం రూ.75వేల కోట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడిగారు. రూ.80వేల కోట్లు రావాలని జెపి కమిటి చెప్పింది.

ఏపికి రావాల్సిన రూ.32వేల కోట్లు పీఎంవో ఆపింది. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై జగన్ ఏనాడూ నోరు తెరవడు. మోది అంటే భయపడేవాడు ఏపికి న్యాయం చేస్తాడా..? కెసిఆర్ తో లాలూచి పడేవాడు ఏపికి న్యాయం చేస్తాడా? మూడు పార్టీల (బిజెపి, వైసిపి, టిఆర్ ఎస్) కుమ్మక్కు ప్రజలకు చెప్పాలి. కులం కాదు మనకు కావాల్సింది. మతం కాదు మనకు కావాల్సింది. అభివృద్ది, సంక్షేమం మనకు కావాలి. ఓట్ల కోసమే మోది 10% రిజర్వేషన్ల బిల్లు తెచ్చారు. కాపు, ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రం చర్యలేవి..? ప్రజాస్వామ్యం ప్రజలపై ఆధాపడాలి. 

అంతేతప్ప మిషన్లపై ఆధారపడేది ప్రజాస్వామ్యం కాదు. ఈవిఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలతో ప్రజాస్వామ్యం మనలేదు. టిడిపి నేతలు, కార్యకర్తలు సమన్వయంగా పని చేయాలి. టిడిపిపై పేదల్లో ఉన్న ఆశలను నెరవేర్చాలి: టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు.