ఈ నెల 22 నుంచి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన

ఈ నెల 22 నుంచి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన

12-01-2019

ఈ నెల 22 నుంచి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ నెల 22 నుంచి 25 వరకూ దావోస్‌లో పర్యటించనుంది. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననుంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌చంద్ర, పూనం మాలకొండయ్య, ముఖ్య కార్యదర్శులు అజయ్‌జైన్‌, కె.విజయానంద్‌, జి.సాయిప్రసాద్‌, సోల్మన్‌ ఆరోఖ్యరాజ్‌,  సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఆర్టీజీ సీఈవో బాబు.ఎ, సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు, వైద్యారోగ్య శాఖ సలహాదారు డా.జితేంద్ర శర్మ, రైతు సాధికార సంస్థ సలహాదారు టి.విజయ్‌కుమార్‌, ఆర్థికాభివృద్ధి మండలి చైర్మన్‌ జాస్తి కృష్ణకిషోర్‌ లతో పాటు సీఎం భద్రతా, వ్యక్తిగత సిబ్బంది మొత్తం 18 మంది వెళ్లనున్నారు.