ఆ పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు : అఖిలప్రియ

ఆ పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు : అఖిలప్రియ

12-01-2019

ఆ పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు : అఖిలప్రియ

మా నాన్న భూమా నాగిరెడ్డి చనిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు మా కుటుంబానికి అండగా నిలిచారు. ఆళ్లగడ్డ అభివృద్ది కోసం రూ.1000 కోట్లు నిధులు ఇచ్చారు. నన్ను మంత్రిని చేసి మా కుటుంబానికి రాజకీయంగా చేయూతనిచ్చారు. అలాంటి చంద్రబాబును, టీడీపీని వీడాల్సిన అవసరం నాకు లేదు అని మంత్రి భూమా అఖిల ప్రియ సృష్టం చేశారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జనసేనలో చేరుతున్నానని వస్తున్న పుకార్లు నమ్మవద్దు. నమ్మి కార్యకర్తలు మోసపోవద్దు. ఆ పార్టీలో చేరాల్సిన అవరం నాకు లేదు. రేటింగ్స్‌ కోసం ఓ చానెల్‌ ద్రుష్పచారం చేస్తోంది. నేను, మా అన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రానున్న ఎన్నికల్లో ఊహించని మెజారీటీతో గెలుస్తాం. ఆ విజయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తాం. గన్‌మెన్‌ను ఉపసంహరించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను అని పేర్కొన్నారు.