ఏపీలో అమిత్ షా పర్యటన

ఏపీలో అమిత్ షా పర్యటన

12-01-2019

ఏపీలో అమిత్ షా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటించనున్నారు. ఈ నెల 18న  వైఎస్‌ఆర్‌ జిల్లా కడపలో పర్యటించనున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లా పరిధిలోని 8 లోక్‌సభ స్థానాల పరిధిలోని 6 వేల మంది పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, పార్టీ పదాధికారులతో సమావేశం కానున్నారు. అలాగే, ఫిబ్రవరి మొదటి వారంలో విశాఖలో పర్యటించి, 6 లోక్‌సభ నియోజకవర్గాల బూత్‌ కమిటీ అధ్యక్షులతో భేటీ అవుతారు. ఫిబ్రవరి మూడో వారంలో గుంటూరులో మరో 8 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు.