నీటిశుద్ధి ప్లాంట్‌కు భూమిపూజ

నీటిశుద్ధి ప్లాంట్‌కు భూమిపూజ

12-01-2019

నీటిశుద్ధి ప్లాంట్‌కు భూమిపూజ

తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌కు కూడా భూమిపూజ చేశారు.

ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు.

రాజధాని తాగునీటి అవసరాలకు రూ.745.65 కోట్లతో నిర్మించే వ్యవస్థలో భాగంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వద్ద 13 మీటర్ల చుట్టు కొలత కలిగిన రెండు ఇన్‌టేక్‌ బావులు నిర్మిస్తారు. కృష్ణాయపాలెం వద్ద 190ఎంఎల్‌డీ సామర్థ్యంగల నీటి శుద్ధి కేంద్రం, 64ఎంఎల్‌ సామర్థ్యం గల... పాక్షకంగా భూగర్భంలో ఉండే... శుద్ధజల రిజర్వాయర్‌, క్లియర్‌ వాటర్‌ పంప్‌ ఏర్పాటవుతాయి. * నీటి పంపిణీ కేంద్రం వద్ద పాక్షికంగా భూగర్భంలో ఉండే 8రిజర్వాయర్లు, ఏడు ఎలివేటెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు నిర్మిస్తారు. 1500-2000మి.మీ.ల చుట్టుకొలత కలిగిన 45కి.మీ.ల పొడవైన క్లియర్‌ వాటర్‌ రింగ్‌ మెయిన్‌ (పంపింగ్‌ మెయిన్‌) నిర్మిస్తారు. దీని నుంచి ఈ కేంద్రాలకు 58 కి.మీ.పొడవైన పైప్‌లైన్లు (500 నుంచి 1500 మి.మీ.ల చుట్టుకొలత కలిగిన) వేస్తారు.

Click here for Photogallery