ఫలితాల తర్వాత మోదీ గుజరాత్‌కి... జగన్‌ లోటస్‌పాండ్‌కి

ఫలితాల తర్వాత మోదీ గుజరాత్‌కి... జగన్‌ లోటస్‌పాండ్‌కి

18-05-2019

ఫలితాల తర్వాత మోదీ గుజరాత్‌కి... జగన్‌ లోటస్‌పాండ్‌కి

120 ఎమ్మెల్యే, 20 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ జోస్యం చెప్పారు. మే 23న జగన్‌కి ఆశాభంగం తప్పదని హితవుపలికారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతున్నారని తెలిసి జగన్‌ను కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి అమరావతి తరిమేశారని వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత మోదీ గుజరాత్‌కి.. జగన్‌ లోటస్‌పాండ్‌కి వెళ్లక తప్పదని సూచించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే జగన్‌, విజయసాయిరెడ్డిని చంచల్‌గూడ జైలుకి పంపుతామని హెచ్చరించారు. పోలవరానికి కేవీపీ సైందవుడిలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఇక విజయసాయిరెడ్డి విషపుసాయిరెడ్డిలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరిలో రీపోలింగ్‌ పెట్టాలని గతంలో మేం డిమాండ్‌ చేస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అయినా ఎన్నికల వ్యవహారంలో సీఎస్‌ జోక్యం ఏంటి? అని ప్రశ్నించారు. మోదీ, జగన్‌ వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు.