రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ

రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ

18-05-2019

రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ

ఎన్డీయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాహుల్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 19న తుదివిడత పోలింగ్‌ ముగియనుండటంతో ఎన్డీఏకు ఎన్నిసీట్లు వచ్చే అవకాశముంది, యూపీఏకు ఎన్ని సీట్లు వస్తాయి, మే 23 తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణ.. తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఎన్డీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు ఇంకా ఏఏ పార్టీల నేతలతో చర్చలు జరపాలి అనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు చర్చించారు.