సైకిల్‌ జోరు ఆగదు - లగడపాటి

సైకిల్‌ జోరు ఆగదు - లగడపాటి

18-05-2019

సైకిల్‌ జోరు ఆగదు - లగడపాటి

 ఆంధ్రప్రదేశ్‌లో హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని.. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ పార్లమెంట్‌ సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని, తెలుగు ప్రజలు ఎప్పుడూ గజిబిజిగా తీర్పు ఇవ్వలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం, చేపట్టిన ప్రాజెక్టులు.. కేంద్రం, రాష్ట్ర సహకారంతోనే సాధ్యమన్న ప్రత్యేక దష్టితో ప్రజలు చూస్తున్నారన్నారు. సర్వే ఫలితం రేపు వెల్లడిస్తానని చెబుతూనే లగడపాటి పరోక్షంగా ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్‌ ఉందని చెప్పారు. తెలంగాణలో పరిస్థితులలో అక్కడి ప్రజలు కారును ఎంచుకున్నట్లే ఏపీలో పరిస్థితులను బట్టి ఇక్కడ సైకిలెక్కారని పేర్కొన్నారు. ఇది తన సర్వే ఫలితం కాదనీ, తన అంచనా మాత్రమేనని లగడపాటి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రంతోనూ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు.