రాష్ట్రంలో మళ్లీ టీడీపీదే అధికారం : కోడెల

రాష్ట్రంలో మళ్లీ టీడీపీదే అధికారం : కోడెల

21-05-2019

రాష్ట్రంలో మళ్లీ టీడీపీదే అధికారం : కోడెల

రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీదే అధికారమని, అనూహ్య స్థానాలతో మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాద్యతలు చేపట్టడం ఖాయమని ఏపీ శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాస్తవ దూరంగా ఉన్న ఎగ్జిట్‌పోల్స్‌ను చూసి అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. సత్తెనపల్లిలో తానే గెలవబోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయన్నారు.  శాంతిభద్రతలు, రాజధాని, పోలవరం నిర్మాణం వంటి అంశాల్ని ఓటర్లు పరిగణనలోకి తీసుకునే టీడీపీ పక్షాన నిలబడ్డారన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏజెంట్లు అప్రమత్తత పాటిస్తూ తుది ఫలితం వెలువడే వరకు అక్కడే ఉండాలని సూచించారు.