రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ఏపీలో పూజలు

రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ఏపీలో పూజలు

21-05-2019

రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ఏపీలో పూజలు

పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించి, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ విజయవాడలోని పాతబస్తీ కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడిలో విజయవాడ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నరసింహారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీసమేతంగా స్వామికి ఉండ్రాళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలని వినాయకుడిని ప్రార్థించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించగలదన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు. అనంతరం ఆయన భక్తులకు ఉండ్రాళ్లు పంచిపెట్టారు.