ఎన్‌టిఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు

ఎన్‌టిఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు

25-05-2019

ఎన్‌టిఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 28న గుంటూరులో నిర్వహించనున్న ఎన్‌టీఆర్‌ జయంతి వేడుకలకు చంద్రబాబు హాజరుకానున్నారు.

గుంటూరులోని టీడీపీ ఆఫీసు ఆవరణలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించి, ఆ పై పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ప్రతి ఏడాది మహానాడు ఉత్సవాలను ఎన్‌టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించే టీడీపీ ఈసారి ఆనవాయితీని తప్పింది. ఎన్నికల ఫలితాల హడావుడి ఉంటుదన్న కారణంతో ఎన్‌టీఆర్‌ జయంతిని యథావిధిగా మే 28న నిర్వహించి, ఆ పై జూలైలో మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.