శాసనసభాపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక

శాసనసభాపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక

25-05-2019

శాసనసభాపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక

వైకాపా శాసనసభాపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఎన్నికయ్యారు. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా జగన్‌ పేరును పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా..ధర్మన ప్రసాద్‌రావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్థసారథి, రోజా, ఆళ్ల నాని తదితరులు బలపరిచారు. అనంతరం జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ తీర్మాన ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేయనున్నారు.

Click here for Photogallery