టీడీపీ ఎమ్మెల్యేలు అర్థనగ్న ప్రదర్శన

టీడీపీ ఎమ్మెల్యేలు అర్థనగ్న ప్రదర్శన

15-06-2019

టీడీపీ ఎమ్మెల్యేలు అర్థనగ్న ప్రదర్శన

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన అవమానం పట్ల టీడీపీ ఎమ్మెల్యేలు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌ కుమార్‌, వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబును సాధారణ ప్రయాణికులు వెళ్లే దారిలో పంపించడం, తనిఖీలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ పాదయాత్ర చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి భద్రత కల్పించామని గుర్తు చేశారు. నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.