చంద్రబాబుకు షాక్

చంద్రబాబుకు షాక్

15-06-2019

చంద్రబాబుకు షాక్

గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని అనుభవం ఎదురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. అయితే తాజాగా దీనిని సడలించిన అధికారులు చంద్రబాబును సాధారణ ప్రయాణికులు వెళ్లేమార్గంలో పంపించటంతో పాటు అణువణువూ తనిఖీ చేశారు. విమానాశ్రయంలో లాంజ్‌ నుండి విమానం వరకూ ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించారు. వీఐపీ, జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించకపోవటం పట్ల టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోనూ చంద్రబాబు వాహన శ్రేణికి పైలెట్‌ క్లియరెన్స్‌ తొలగించారు. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతాపరంగా శ్రేయస్సు కాదని టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.