వైసీపీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభం

వైసీపీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభం

15-06-2019

వైసీపీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆడుగుతూనే ఉండాలని, కేంద్ర నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ఎప్పటికప్పుడు గళం వినిపించాలని ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా సమాలోచనలు చేశారు. సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ఎంపీల బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో బృందానికి కొన్ని శాఖలను అప్పగించనున్నారు. శాఖల నుంచి నిధుల విడుదలకు ఆయా బృందాలు పనిచేయాలని జగన్‌ సూచించారు.