చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు

చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు

19-06-2019

చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి భద్రత తగ్గించారనే ఆరోపణల్లో నిజం లేదని డీజీపీ గౌతం సవాంగ్‌ సృష్టం చేశారు. పోలీసుశాఖలో వీక్లీ ఆఫ్‌ అమలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పోలీసు వీక్లీ ఆఫ్‌ అంశంపై ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగని అన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది అవాస్తమని కొట్టిపారేశారు. శాంతి భద్రతల విషయంలో నిష్పాక్షికంగా ఉండాలని ముఖ్యమంత్రి సృష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. పోలీసుశాఖలో ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇకపై పోలీసు అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదని సృష్టం చేశారు. గతంలో ఏసీబీ జరిపిన దాడులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అవినీతి నిరోధక శాఖ కూడా చట్ట ప్రకారమే వ్వవహరించాలన్నారు.