అది భవిష్యత్‌కు ప్రమాదకరం : అచ్చెన్నాయుడు

అది భవిష్యత్‌కు ప్రమాదకరం : అచ్చెన్నాయుడు

19-07-2019

అది భవిష్యత్‌కు ప్రమాదకరం : అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానిస్తే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చునని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుంచి నీళ్లు తేవాలనుకోవడం సరికాదని, భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 45 రోజులైనా ఒక్క ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌ చేయలేదని విమర్శించారు. తాను అప్రజాస్వామికంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తెలంగాణ వల్ల ఏపీ రాష్ట్రానికి ఒక్క పైసా లాభం జరగలేదని, అన్నీ తెలంగాణకే రాసిచ్చారని ఆరోపించారు.