ఏపీ గవర్నర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

ఏపీ గవర్నర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

19-07-2019

ఏపీ గవర్నర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 23న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 3:40 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం కనక దుర్గమ్మను దర్శించుకోనున్న బిశ్వభూషణ్‌.. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. విజయవాడలోని నీటిపారుదల శాఖ భవనాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.