పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయింది

పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయింది

16-09-2019

పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయింది

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ సీనియర్‌ నేత, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణ అన్నారు. పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులతోనే కోడెల మృతి చెందారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యలపై ప్రభుత్వం కేసులు పెట్టి, వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. పార్టీ కోసం కోడెల చివరివరకు పరితపించారని యనమల పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఒక గొప్ప స్నేహితుడని కోల్పోయానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.