ప్రభుత్వాలు శాశ్వతం కాదు : చంద్రబాబు

ప్రభుత్వాలు శాశ్వతం కాదు : చంద్రబాబు

10-10-2019

ప్రభుత్వాలు శాశ్వతం కాదు : చంద్రబాబు

ఓటమి కారణంగా కార్యకర్తలు కుంగిపోకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు కాపాడటంపై పోలీసులు దృష్టిపెట్టాలని సూచించారు. హుద్‌హుద్‌, తిత్లీ వంటి పెను తుపాన్లు వచ్చినప్పుడు తాము ప్రజల మధ్యే ఉన్నామని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా వరదలు వస్తే ముఖ్యమంత్రి జగన్‌ జెరూసలేం, అమెరికాల్లో పర్యటించారని విమర్శించారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చలనం, ఆలోచన లేదని అన్నారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని వారు గుర్తుంచుకోవాలన్నారు. చట్టాన్ని చుట్టంగా చేసుకుంటే ఆ చట్టమే ఉరితాడవుతుందన్నారు. టీడీపీ నేతల ఫిర్యాదును డీజీపీ తీసుకోరనీ, వైసీపీ వాళ్లకు మాత్రం ఆయన రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నారని ఆక్షేపించారు.