బీజేపీలో చేరిన మాజీ మంత్రి

బీజేపీలో చేరిన మాజీ మంత్రి

21-10-2019

బీజేపీలో చేరిన మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆదినారాయణ రెడ్డికి బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదినారాయణ రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. కడప జిల్లాలో టీడీపీ కీలకనేతగా ఉన్న ఆది బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి షాక్‌ తగిలినట్లైంది.