ఏపీ సీఎస్‌గా నీలం సాహ్నీ

ఏపీ సీఎస్‌గా నీలం సాహ్నీ

12-11-2019

ఏపీ సీఎస్‌గా నీలం సాహ్నీ

ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి నీలం సాహ్నీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఆమెను రిలీవ్‌ చేసి రాష్ట్రానికి తిరిగి పంపేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమెను రాష్ట్రానికి పంపుతూ ప్రధాన మంత్రి పరిధిలోని కేంద్ర సిబ్బంది, శిక్షణ, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖకు చెందిన కేబినేట్‌ పరిపాలన, నియామకాల కమిటీ కార్యదర్శి పీకే త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు.