TANA
Telangana Tourism
Karur Vysya Bank

అమరావతికి ఆస్ట్రేలియా సహకారం

18-03-2017

అమరావతికి ఆస్ట్రేలియా సహకారం

జల వనరుల్ని సమర్థంగా వినియోగించుకునే రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడంలో సహకరించేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచిచంది. ఆస్ట్రేలియా-ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సహకార ఒప్పందంలో భాగంగా వివిధ అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం విజయవాడలోని సీఆర్‌డీఏ కమిషనర్‌, అధికారులతో సమావేశమైంది. పట్టణ ప్రాంతాల్లో నీటి సపరఫరా, నిర్వహణ ప్రాజెక్టుల్లో తమకున్న ప్రపంచస్థాయి నైపుణ్యాల గురించి ఆస్ట్రేలియా ప్రతినిధులు వివరించారు.  జలవనరుల సమర్థ వినియోగానికి సంబంధించి దేశంలోని మిగతా నగరాలకు అమరావతి ఆదర్శంగా నిలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియాకి చెందిన సీఆర్‌సీడబ్యూసీ సంస్థ సీఈఓ టోనీ వాంగ్‌, దక్షిణ భారతదేశానికి ఆస్ట్రేలియా కాన్సూల్‌ జనరల్‌ సీన్‌ కెల్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంలో భాగస్వామ్యానికి ముందుకువచ్చినందుకు ఆస్ట్రేలియా బృందానికి సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.