వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మస్తాన్‌రావు

వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మస్తాన్‌రావు

07-12-2019

వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మస్తాన్‌రావు

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బీద మస్తాన్‌రావు గుడ్‌ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మస్తాన్‌ రావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువా కల్పి మస్తాన్‌రావును వైసీపీలోకి జగన్‌ ఆహ్వానించారు. సీఎం జగన్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చే పార్టీ మారానని మస్తాన్‌ రావు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి, మేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు హాజరయ్యారు.