వైఎస్‌ఆర్‌సీపీలోకి గంగరాజు

వైఎస్‌ఆర్‌సీపీలోకి గంగరాజు

09-12-2019

వైఎస్‌ఆర్‌సీపీలోకి గంగరాజు

బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైకాపాలో చేరనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో గంగరాజు కుమారుడు రంగరాజు (పెద్ద బుజ్జి) సోదరులు వెంకట నరసింహరాజు, రామరాజు పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. వీరి చేరికను పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. గంగరాజు కూడా వైకాపాలో చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే గంగరాజు వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.