ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

09-12-2019

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లో 2020 జనవరిలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు పై విధంగా మంత్రి సమాధానమిచ్చారు. 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి సురేష్‌ ప్రకటన చేశారు. మొత్తానికి చూస్తే డీఎస్సీ కోసం ఇన్ని రోజులుగా వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తేనని చెప్పుకోవచ్చు.