భారత రత్న సాధిస్తాం

భారత రత్న సాధిస్తాం

29-05-2017

భారత రత్న సాధిస్తాం

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి కోరారు. మహానాడు ప్రాంగణంలో పలువురు ఎంపీలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చే అంశం పార్లమెంటు నుంచి ప్రధాని వద్దకు వెళ్లిందని, తప్పకుండా భారత రత్న వస్తుందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తీర్మానాన్ని ఆయన బలపరిచారు.