నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల- అగస్టు 23 పోలింగ్, 28 కౌంటింగ్

నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల- అగస్టు 23 పోలింగ్, 28 కౌంటింగ్

27-07-2017

నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల- అగస్టు 23 పోలింగ్, 28 కౌంటింగ్

నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను అధికార తెలుగుదేశం, విపక్ష వైకాపా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. నంద్యాల ఉపఎన్నికలు ఈ నెల 29న నోటిఫికేషన్, నామినేషన్లకు గడువు ఆగస్టు 5, పోలింగ్ అగస్టు 23, ఓట్ల లెక్కింపు ఆగస్టు 28న జరుగుతుంది.