ఎన్నికల కురుక్షేత్రానికి నంద్యాల ఉప ఎన్నికలే నాంది

ఎన్నికల కురుక్షేత్రానికి నంద్యాల ఉప ఎన్నికలే నాంది

04-08-2017

ఎన్నికల కురుక్షేత్రానికి నంద్యాల ఉప ఎన్నికలే నాంది

2019లో జరుగనున్న సాధారణ ఎన్నికల కురుక్షేత్రానికి నంద్యాల ఉప ఎన్నికలే నాంది అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజలు శ్రీకృష్ణుని పాత్ర పోషించి వైసిపిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా గురువారం పట్టణంలోని ఎస్పీజి మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు చెబుతారన్నారు. నంద్యాలలో ఆనవాయితీకి విరుద్దంగా వైసిపి పోటీ చేస్తోందని ఇప్పటికే అనేకసార్లు చెప్పారని, అయితే నంద్యాల స్థానాన్ని తమ పార్టీ గెలుచుకుందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మరణించినందున తమ పార్టీకి ఏకగ్రీవంగా ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు.