నంద్యాలలో నాన్ లోకల్స్ వెళ్లాల్సిందేనన్న ఈసీ

నంద్యాలలో నాన్ లోకల్స్ వెళ్లాల్సిందేనన్న ఈసీ

20-08-2017

నంద్యాలలో నాన్ లోకల్స్ వెళ్లాల్సిందేనన్న ఈసీ

నంద్యాలలో స్థానికేతలరులందరూ వెళ్లిపోవాల్సిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా గత నెలరోజుల నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు నంద్యాలలోనే తిష్ట వేసి ఉన్నారు. నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం, సర్వేలతో పాటు డబ్బు పంపిణీ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఇతర ప్రాంతాల నుంచి నేతలను, కార్యకర్తలను డంప్ చేశారు. ఏపీలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలతో నంద్యాలలో లాడ్జీలన్నీ నిండిపోగా, కర్నూలులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

కేంద్ర బలగాల కవాతు……..

ఈనేపథ్యంలో నంద్యాలలో శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశముందని భావించిన ఎన్నికల కమిషన్ నంద్యాలలో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగుస్తుంది. ఈ ప్రచారం ముగిసిన వెంటనే ఐదుగంటల కల్లా నంద్యాలలో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదని ఆదేశించింది. ఇప్పటికే నంద్యాలలో కేంద్ర పోలీసు బలగాలు దిగాయి. మొత్తం 129 సమస్యాత్మక పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం గుర్తించింది. కేంద్ర పోలీసు బలగాలను సమస్యాత్మకం ప్రాంతాల్లోనే నియమించింది. ముఖ్యంగా నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లోనే ఎక్కువగా కేంద్ర బలగాలు దిగి కవాతును నిర్వహించాయి.