నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్‌

నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్‌

23-08-2017

నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్‌

జిల్లాలోని నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్‌ కొనసాగనుంది. 2,19,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 255 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు

నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్‌నగర్‌ బూత్‌ నంబర్‌ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు.