నంద్యాల గెలుపు చంద్రబాబు విజయం కాదు.. 

నంద్యాల గెలుపు చంద్రబాబు విజయం కాదు.. 

28-08-2017

నంద్యాల గెలుపు చంద్రబాబు విజయం కాదు.. 


టీడీపీ అధికార దుర్వినియోగం చేసి గెలిచింది
ఉప ఎన్నిక కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు
ఓటర్లను టీడీపీ భయపెట్టిందన్న శ్రీ వైయస్ జగన్ 
శిల్పా బ్రదర్స్ కు హ్యాట్సాఫ్ 
విలువలతో కూడిన రాజకీయాలు చేశాం
మా టైం వచ్చినప్పుడు మేమూ కొడతామన్న శ్రీ వైయస్ జగన్

ఆ 20 మందితో ఉప ఎన్నికలు రండి.. రిఫరెండంగా తీసుకుంటామని శ్రీ వైయస్ జగన్ సవాల్

నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని శ్రీ వైయస్ జగన్ మండిపడ్డారు. దాదాపు రూ.200 కోట్లు డంబ్బు పంపిణీ చేశారని, పోలీసులతో కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులు చేశారన్నారు. పోలీసు వ్యవస్థ అంతా ఒకవైపు ఉండే విధంగా పరిస్థితులు స)ష్టించారన్నారు. చివరకు అధికార పార్టీ నేతలు ఓటర్ల వద్దకు వెళ్లి ఇదిగో మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ పెన్షన్ రాదని భయపెట్టినా వారు ధైర్యంగా ఓట్లు వేసిన ప్రజలందరికీ శ్రీ వైయస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చినా, ప్రలోభాలు, భయాల మధ్య పార్టీకి అండగా నిలబడిన ప్రతి కార్యకర్తకీ, నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారాయన.  పార్టీ తరుపున అభ్యర్థిగా నిలబడిన శిల్పామోహన రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలకు హ్యాట్సాఫ్ అని వైయస్ జగన్ తెలిపారు.

అధికార పార్టీకి రాజీనామా చేసి, ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవీకాలాన్ని కూడా చక్రపాణి రెడ్డి త)ణప్రాయంగా మూడు నెలలకే వదలివేశారని ఈ సందర్భంగా వారికి హ్యాట్సాఫ్ అన్నారు. పార్టీలో వచ్చే వారు నైతిక విలువలు పాటించాలన్న నియమానికి వారు కట్టుబడ్డారన్నారు. ఎన్నికలకు వెళ్లినా, వేరే పార్టీ నుంచి వచ్చినా విలువలతో కూడిన రాజకీయాలే చేశామన్నారు. అలాగే.. శిల్పా చక్రపాణి రెడ్డి కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు ఓ విజయంగా భావిస్తే నిజంగా దానంత దిగజారుడుతనం ఇంకొకటి లేదని శ్రీ వైయస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల్లో నేను ప్రజలతోనే ఉన్నానని వారితో కలిసే సాగానని శ్రీ జగన్ గుర్తు చేశారు.  ప్రజల్ని నేను ప్రశ్నలు అడిగితే.. వారు ఇచ్చిన సమాధానాలు మీరంతా చూశారన్నారు.

చంద్రబాబు ఎన్నికల్లో ప్రజల్ని చేసిన మోసాలు, తర్వాత డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ఎలా మోసం చేశారో .. విద్యార్థులను, యువతను నిరుద్యోగ భ)తి, 2వేలు అంటూ.. ఏ రకంగా మోసం చేశారో.. రేషన్ కార్డుల దగ్గర నుంచి బియ్యందగ్గర నుంచి కరెంటు బిల్లుల వరకు ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందన్నారు. బాబు ప్రజల్ని మోసం చేశారని ప్రతి మీటింగ్ లో చేతులు ఎత్తిన పరిస్థితి కనిపించిందన్నారు. ఈ ఎన్నికల్లో బాబు గెలవటానికి కారణం ఒక్కటే అని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. ఇది సాధారణ ఎన్నిక కాదు కాబట్టి బాబు గెలిచారన్నారు. బాబుతో ఇంకోసంవత్సరం కొనసాగాలి కాబట్టి ఇంకో గత్యంతరం లేదు కాబట్టి ఆయన డబ్బుతో ప్రలోభ పెట్టారన్నారు. దీంతో ఓట్లు పడి చంద్రబాబు గెలిచారన్నారు.దీన్ని చంద్రబాబు విజయంగా భావిస్తే ఆయనంతటి మూర్ఖుడు ఇంకొకరు ఉండరని శ్రీ వైయస్ జగన్ ఎద్దేవా చేశారు.  ఒకేఒక్క చోట అసెంబ్లీ ఎన్నిక జరపటం 200 కోట్లు ఖర్చు పెట్టడం, మంత్రులు పెట్టడం, పోలీసులతో భయపెట్టారని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. చంద్రబాబుకు ప్రజలు భయపడే టీడీపీకి ఓట్లేశారని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. 

రెఫరెండం ఎలా అవుతుంది? 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రండి. 
రెఫరెండం అవునో కాదో తేల్చుకుందామని సవాల్.. 

పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రమ్మనండి. అప్పుడు రెఫరెండం అంటే చూద్దామన్నారు. పోలీసులు, డబ్బుతో భయభ్రాంతులు చేసి ఇది రెఫరెండం ఎలా అవుతుందని శ్రీ వైయస్ జగన్ ప్రశ్నించారు. అప్పుడు ఒక్కోచోట రెండువేల కోట్లు చొప్పన 40వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారో.. ఎలా మంత్రులను, పోలీసులను మోహరిస్తారో చూస్తామని శ్రీ వైయస్ జగన్ అన్నారు. మా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లను చంద్రబాబు తీసుకొని తన పార్టీ మీద గెలిపించే నమ్మకం ఆయనకు లేదన్నారు.