నంద్యాలలో టీడీపీ ఘనవిజయం

నంద్యాలలో టీడీపీ ఘనవిజయం

28-08-2017

నంద్యాలలో టీడీపీ ఘనవిజయం

నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘనవిజయం సాధించారు. 17 రౌండ్లు ముగిసేసరికే తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమైంది. ఇంకా రెండు రౌండ్ల లెక్కింపు ఉండగానే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి, వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచీ సృష్టమైన ఆధిక్యంలో కొనసాగిన టీడీపీ అదే హవాను చివరి వరకు కొనసాగించింది. 17 రౌండ్ల లెక్కింపు ముగిసేసరికి 26,523 ఓట్ల ఆధిక్యం తెలుగుదేశం పార్టీకి లభించింది.  దాదాపు ప్రతి రౌండ్‌లో తెలుగుదేశం పార్టీ  అభ్యర్థికి బ్రహ్మరథం పట్టారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి ఏ దశలోనూ అధిక్యాన్ని కనబరచలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ సుమారు వెయ్యి ఓట్లకే పరిమితమైంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. తెలుగుదేశం అభ్యర్థికి 97,076 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థికి 69,610 ఓట్లు వచ్చాయి.