మేయర్‌ పీఠం ఎవరికో?
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

మేయర్‌ పీఠం ఎవరికో?

02-09-2017

మేయర్‌ పీఠం ఎవరికో?

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ మేయర్‌ పీఠంపై ఎవరిని కూర్చోబెడతారనే దానిపై కార్యకర్తల్లో ఉత్కంఠత నెలకొంది. ఎన్నికలకు ముందే కాపులకు మేయర్‌ పీఠం ఇస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. హామీ  మేరకు గెలిచిన కార్పొరేటర్లలో ఎవరికీ పీఠం అప్పచెప్పాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. మేయర్‌ ఎవరన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే ఫైనల్‌ కానుంది.  మేయర్‌ పీఠం కోసం గెలిచిన కార్పొరేటర్లలో తీవ్రమైన పోటీ ఉంది. మహిళా కార్పొరేటర్లు అడ్డూరి వరలక్ష్మిశ్రీనివాస్‌, మాకినీడి శేషుకుమారి, సుంకర పావని, సుంకర శివప్రసన్నలు మేయర్‌ అభ్యర్థిత్వం కోరుతున్నారు. వీరంతా పార్టీలో ఒక్కొక్క సీనియర్‌ నాయకుడి ద్వారా తమతమ స్థాయిల్లో ప్రయత్నిస్తున్నారు. అయితే డిప్యూటీ మేయర్‌ పదవి బీజేపీకి ఇవ్వాలని తొలుత ఆ పార్టీ డిమాండ్‌ చేసినప్పటికీ ఆ పదవిని ఆవించిన జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఓటమి పాలు కావడంతో ఆ డిమాండ్‌ పక్కకెళ్ళిపోయింది. కాగా ఎమ్మెల్యే సోదరుడి కుమారుడికోసం డిప్యూటీ మేయర్‌ పదవిని రిజర్వ్‌ చేయాలని ఓ వర్గం తాపత్రయపడుతుంది.