దెబ్బ‌కు రూ.7 కోట్లు గంగ‌పాలు!
Nela Ticket
Kizen
APEDB

దెబ్బ‌కు రూ.7 కోట్లు గంగ‌పాలు!

12-09-2017

దెబ్బ‌కు రూ.7 కోట్లు గంగ‌పాలు!

ఏపీ సీఎంగా త‌న‌ను తాను సూప‌ర్ సీఎంగా అభివ‌ర్ణించుకునే టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఏం చేస్తున్నారో కూడా చూసుకోకుండానే ముందుకు సాగుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. సాధార‌ణంగా సాగు నీటి ప్రాజెక్టులంటే దీర్ఘ కాల ప్ర‌యోజ‌నాల‌ను ఆశించి నిర్మించేవే. వేలాది కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అయ్యే ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో అనివార్యంగా ఆల‌స్య‌మైనా కూడా దీర్ఘ కాలిక ప్ర‌యోజ‌నాల‌నే చూడాలి త‌ప్ప‌… అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌యోజ‌నం క‌నిపించాలంటే మొద‌టికే మోసం వ‌స్తుందని సాగు నీటి రంగ నిపుణులు  చెబుతున్నారు. బాబు చేస్తున్న మ‌రో ఆత్రం రాష్ట్ర ఖ‌జానాకు ఉన్న‌ప‌ళంగా 7 కోట్ల మేర న‌ష్టాన్ని మిగిల్చింది.

ఈ తాజా వ్య‌వ‌హారం అస‌లు వివ‌రాల్లోకెళితే… హంద్రీ నీవా సుజ‌ల స్ర‌వంతి ప‌థ‌కం ఫేజ్‌-1లో భాగంగా… క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు ప‌రిధిలోని మ‌ల్యాల వ‌ద్ద తాత్కాలిక ప్రాతిప‌దిక‌న బాబు స‌ర్కారు ఓ రెగ్యులేట‌ర్‌ను నిర్మించింది. ముచ్చుమ‌ర్రి నుంచి కృష్ణా జ‌లాల‌ను హంద్రీ నీవా కాలువ‌లోకి ఎత్తిపోసేందుకే ఈ రెగ్యులేట‌ర్‌ను బాబు స‌ర్కారు నిర్మించింది. అది కూడా తాత్కాలిక ప్రాతిప‌దిక‌నేన‌ట‌. ఈ రెగ్యులేట‌ర్ నిర్మాణానికి ఏకంగా రూ.7 కోట్ల మేర ఖ‌ర్చైంది. ఈ మొత్తం నిధుల‌తో నిర్మిత‌మ‌య్యే స‌ద‌రు రెగ్యులేటర్‌ను కాంట్రాక్టు సంస్థ ఇంకా పూర్తిగా నిర్మించ‌నేలేదు. రెగ్యులేట‌ర్ పూర్త‌య్యే దాకా కూడా నిల‌బ‌డ‌లేని చంద్ర‌బాబు… రిబ్బ‌న్ క‌ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిర్మాణం ఇంకా పూర్తి కాని రెగ్యులేట‌ర్ ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లు జ‌రిగిపోయాయి.

మొన్న క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు స‌ద‌రు రెగ్యులేట‌ర్‌ను జాతికి అంకితం చేసేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన మూడు పంపుల‌ను ప్రారంభించారు. ఇంత‌దాకా బాగానే ఉన్నా… బాబు ప్రారంభించి వెళ్లిపోగానే.. కేవ‌లం 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే స‌ద‌రు రెగ్యులేట‌ర్ కుప్ప‌కూలిపోయింది. దీంతో షాక్ తిన్న అధికారులు హంద్రీ నీవాలోకి కృష్ణా జ‌లాల పంపింగ్‌ను అర్ధాంత‌రంగా నిలిపివేయాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా ఇప్ప‌టిదాకా ఆ రెగ్యులేట‌ర్‌కు ఖ‌ర్చు చేసిన రూ.7 కోట్లు బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా మారిపోయింద‌ట‌. ఈ రెగ్యులేట‌ర్ ప్రారంభించిన వెంట‌నే కుప్ప‌కూలిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీస్తే… నిర్మాణం పూర్తి కాక‌ముందే ప్రారంభిస్తే… ప‌రిస్థితి ఇలాగే ఉంటుంద‌ని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.  మ‌ల్యాల రెగ్యులేట‌ర్ ప్రారంభించిన ఒక్క‌టంటే ఒక్క రోజులోనే కుప్ప‌కూలింద‌న్న మాట‌.