తెలుగుదేశం లోకి లగడపాటి?
Nela Ticket
Kizen
APEDB

తెలుగుదేశం లోకి లగడపాటి?

12-09-2017

తెలుగుదేశం లోకి లగడపాటి?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకోనుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం పార్లమెంట్‌లోనూ, బయటా ఆవిశ్రాంతంగా పోరాటం చేసి, చివరికి రాజకీయాల నుంచి తప్పుకున్న కాంగ్రెస్‌ మాజీ నేత లగడపాటి రాజగోపాల్‌ మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అవుననే సమాధానం చెబుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన నాటి నుంచి లగడపాటి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో సర్వేల పేరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆయా సందర్భల్లో రాజకీయాల్లో వస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రాజకీయాలంటే ఇష్టమే కానీ మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. లగడపాటి టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లగడపాటి రాజగోపాల్‌ సీఎంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ముఖ్యమంత్రి పిలవడం వల్లే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. కాగా, గతంలోనూ సీఎం చంద్రబాబుతో లగడపాటి భేటీ అయిన విషయం తెలిసిందే.