జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం

జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం

06-11-2017

జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం

అన్ని వ‌ర్గాల‌కు మేలు చేయాల‌నేదే నాకున్న క‌సి
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సంద‌ర్భంగా  ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తున్నా
ఇడుపుల పాయ ఎగ్జిట్ గేటు వ‌ద్ద బ‌హిరంగ స‌భ‌లో 
2017-11-06- వైయ‌స్సార్‌సీపీ అధ్య క్షుడు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు

కాసులంటే కక్కుర్తి లేదు. కేసులంటే భయపడను. నాకు కసి ఉంది. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్నదే నా ఆశయం. నేను వెళ్లిపోయాక కూడా ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలి’ అని వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు వైఎస్‌ సమాధి వద్ద తన కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా వైఎస్‌ ఎస్టేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభ వద్దకు చేరుకుని ప్రసంగించారు. ‘చంద్రబాబు పాలనలో ఉద్యోగులు సంతోషంగా లేరన్నారు. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పింఛను విధానం ఏడాది కాలంగా వద్దంటున్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పిన హామీనీ గాలికొదిలారు. ఈ విషయాల్లో తాను తప్పక మంచి చేస్తాను. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి స్థలం, గృహం మంజూరు చేస్తాం. జాబు రావాలంటే బాబు పోవాలన్నదే తమ నినాదం. బాబు హయాంలో గ్రామాల్లో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కరవైంది. ప్రజాప్రతినిధులకు అధికారాలు పోయి.. జన్మభూమి కమిటీలనే ముఠాలకు అధికారాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాను. ప్రజలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్రకు వస్తున్నా. వైఎస్‌ ఎంత గొప్పవాడో జగన్‌ అంత మంచివాడని మీ అందరి చేత అనిపించుకుంటా.’ అని అన్నారు.


Click here for PhotoGallery