ఈ నెల 25 వరకు ఏపీ అసెంబ్లీ

ఈ నెల 25 వరకు ఏపీ అసెంబ్లీ

10-11-2017

ఈ నెల 25 వరకు ఏపీ అసెంబ్లీ

ఈ నెల 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మొత్తం పది రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని ఖరారు చేశారు. ఈ సమావేశాల్లో మొత్తం 27 అంశాలు చర్చించాలని నిర్ణయించారు. 15 అంశాలు చర్చించాలని బీజేపీ ప్రతిపాదించింది. విశాఖలో 16, 17 తేదీల్లో అంతర్జాతీయ సదస్సులో సభ్యులు పాల్గొంటారని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఈ సదస్సు కారణంగా ఈ రోజుల్లో సభకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. సభను బహిష్కరించాలని వైకాపా నిర్ణయించడంతో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు జరగనున్నాయి.