వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బ్రేక్‌

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బ్రేక్‌

10-11-2017

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బ్రేక్‌

వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. కాగా, ప్రస్తుతం జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రాలో ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోర్టు వాయిదా ఉన్నందున పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వచ్చారు. మళ్లీ రేపటి నుంచి ఆయన పాదయాత్రను కొనసాగించనున్నారు.