ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాదే విజయం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాదే విజయం

10-11-2017

ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాదే విజయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 175 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ఎంపీ మాగంటి బాబు జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌ అసెంబ్లీకి రాకుండా ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు వ్యతిరేకిస్తారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాష్ట్రాన్ని దోచేస్తే అమరావతి నిర్మాణం జరుగుతుందా? పోలవరం వస్తుందా? ఈ పనులు ఒక్క చంద్రబాబు వల్లే జరుగుతాయని, ఆ విషయం ప్రజలకు తెలుసునని అన్నారు.